విజయవాడ కనక దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

by Disha Web |
విజయవాడ కనక దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
X

దిశ, చార్మినార్: విజయవాడ ఇంద్ర కీలాద్రి‌పై తెలంగాణ బోనాల జాతర నిర్వహించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గ అమ్మవారికి ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఇందుకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కనకదుర్గ ఆలయం ఈవో భ్రమరాంబ, విజయవాడ డీసీపీ బాబురావు హాజరయ్యారు. సుల్తాన్ షాహి శ్రీ జగదాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శనివారం విజయవాడకు బయలుదేరారు. బంగారు బోనంతో విజయవాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యాన్ని సమర్పించారు. 13 ఏండ్లుగా ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షుడు రాకేశ్ తివారి, ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ క్రాంతి కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, జనగామ మధుసూధన్​గౌడ్, మధుసూధన్​ యాదవ్, కేఎస్ ఆనంద్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed