తెలంగాణ కరెంట్ అఫైర్స్ -2022

by Disha Web Desk 17 |
తెలంగాణ కరెంట్ అఫైర్స్ -2022
X

దిశ, వెబ్‌డెస్క్:

* తెలంగాణకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ గుడిమల్ల భరత్‌భూషణ్ అనారోగ్యంతో మరణించారు. ఈయన తెలంగాణ సామాజిక పరిస్థితులను తన ఫొటోల ద్వారా తెలియజేశారు.

* భారత్ నుంచి తొలిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదికగా నిలిచింది.

* తెలంగాణలోని 33 జిల్లాలతో రూపొందించిన మ్యాప్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్ విడుదల చేశారు.

* తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా ఐ.ఎఫ్.ఎస్ అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ నియమితులయ్యారు.

* సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

* ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ గ్రాఫ్టన్ మోటార్స్ తెలంగాణలో రూ.150 కోట్లతో విద్యుత్ వాహనాల తయరీ ప్లాంట్‌ను ఏర్పాటుచేయనుంది.

* రామగుండంలో నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

* 2022 చివరినాటికి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి 13.54లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

* రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు.

* సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ తన రెండో అతిపెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి లో నిర్మించనుంది.


Next Story

Most Viewed