తెలంగాణలో పోటీ చేస్తాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు న‌ర్సింహులు క్లారిటీ..

by Disha Web |
తెలంగాణలో పోటీ చేస్తాం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు న‌ర్సింహులు క్లారిటీ..
X

దిశ, ముషీరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బ‌క్కని న‌ర్సింహులు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం క‌వాడిగూడ‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ల సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా అధ్యక్షత వహించగా.. తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు శ్రీబక్కని నర్సింహులు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు తీరు తెన్నులు, సాధక భాదకాలు ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం తప్పక కృషి చేస్తానని బ‌క్కని న‌ర్సింహులు హామీ ఇచ్చారు.

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు హామీ ప్రకారం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని న‌ర్సింహులు అన్నారు. ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందన్నది, అనాటికి ఉన్న రాజకీయ బలాబలాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలియజేశారు. కాబట్టి పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నా, అన్ని త్వరలో సమసిపోతాయని అన్నారు. పార్టీ పటిష్టత కోసం కొన్ని కఠిన చర్యలు తప్పవని, పదవులను అలంకార ప్రాయంగా పెట్టుకుని క్రియాశీలకంగా వ్యవహించని వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర అధ్యక్షుడు న‌ర్సింహులు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed