గుడివాడ మినీ మహానాడు షెడ్యూల్ ఇదే

by Disha Web |
గుడివాడ మినీ మహానాడు షెడ్యూల్ ఇదే
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న గుడివాడలో నిర్వహించే మినీ మహానాడు షెడ్యూల్‌ను వివరించారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు రోడ్ షోగా బయలుదేరుతారని, సాయంత్రం 5గంటలకు అంగలూరులోని సభా వేదికకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రి 10 గంటలకు నిమ్మకూరులో బస చేసి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జులతో సమీక్షిస్తారని చెప్పారు. అంగలూరు సభలో లక్షలాది మంది పాల్గొంటున్నారని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed