- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాంకర్, లారీ ఢీకొని.. డ్రైవర్ సజీవ దహనం
అనంతపురం జిల్లా డి. హిరేహాల్ మండలం జాజరకల్లు టోల్ ప్లాజా వద్ద ఆయిల్ ట్యాంకర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: ఉహించని రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం (Driver burned alive) అయ్యాడు. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జిల్లాలోని డి. హిరేహాల్ (D. Hirehall) మండలం జాజరకల్లు టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఓ ఆయిల్ ట్యాంకర్, లారీ ఒకదానికొకటి అత్యంత బలంగా ఢీకొన్నాయి.
ఈ ఘోర ప్రమాదం కారణంగా ఆయిల్ ట్యాంకర్ నుంచి ఇంధనం లీకై క్షణాల వ్యవధిలోనే భారీగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. చూస్తుండగానే రెండు భారీ వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయిన డ్రైవర్, బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది






