తాలిబన్ వ్యవస్థాపకుడి కారు 20 ఏళ్ల తర్వాత బయటికి..

by Dishanational1 |
తాలిబన్ వ్యవస్థాపకుడి కారు 20 ఏళ్ల తర్వాత బయటికి..
X

కాబూల్: సుమారు 20 ఏళ్ల తర్వాత తాలిబాన్ వ్యవస్థాపకుడు మల్లహ్ ఒమర్ వాడిన కారు బయటపడింది. తాలిబన్ ఫౌండర్ ముల్లాహ్ ఓమర్ యూఎస్ బలగాల నుంచి తప్పించుకునేందుకు ఈ కారును ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఫ్ఘాన్ మీడియాకు విడుదల చేశారు. జబుల్ ప్రావిన్సులోని ఓ గ్రామంలోని తోటలో తెల్లటి టయోట కొరొల్లాను పూడ్చిపెట్టినట్లు అధికారులు తెలిపారు. తాజాగా తవ్వకాలు జరిపి దీనిని బయటకు తీశారు. ప్రస్తుతం కారు పరిస్థితి బాగానే ఉందని, అయితే ముందు భాగం కాస్తా దెబ్బతిన్నదని జబుల్ ప్రావిన్సు అధికారి రహ్మతుల్లా హమద్ చెప్పారు. ఈ వాహనం మిస్ అవకుండా ఉండేందుకు 2001లో ఒమర్‌ స్మారక చిహ్నంగా పాతిపెట్టారని ఆయన చెప్పారు. దీనిని గొప్ప చారిత్రక స్మారక చిహ్నమని పేర్కొంటూ, రాజధాని జాతీయ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు.

కాందహార్‌లో ముల్లహ్ ఒమర్ నేతృత్వంలో ఏర్పడిన తాలిబన్ సంస్థ, 1996లో ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం దేశంలో కఠిన ఇస్లాం చట్టాన్ని అమలు చేసింది. దీంతో అనేక మిలిటెంట్లు గ్రూపులకు అఫ్ఘానిస్తాన్ స్థావరంగా మారింది. వీరిలో సెప్టెంబర్ 11 దాడుల వ్యుహకర్త ఒసామా బిన్ లాడెన్ కూడా ఉన్నారు. తాలిబన్లు బిన్ లాడెన్‌తో కలిసేందుకు నిరాకరించిన సమయంలో అమెరికా మిత్రదేశాలతో కలిసి అప్ఘానిస్తాన్‌‌పై దాడులు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013లో ఒమర్ మరణించినప్పటికీ కొన్ని ఏళ్ల పాటు ఆయన చావును రహస్యంగా ఉంచారు. గతేడాది యూఎస్ బలగాలు వెనక్కి మళ్లడంతో తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.


Next Story