కార్తికేయ-2లో స్వాతి క్యారెక్టర్‌.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్

by Disha Web Desk |
కార్తికేయ-2లో స్వాతి క్యారెక్టర్‌.. క్లారిటీ ఇచ్చిన నిఖిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య సినిమాలకు స్వీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే చాలు అదే తరహా పాత్రల్లో సీక్వెల్స్ లోనూ కంటిన్యూ అవుతూ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతుండటారు. ఇలా ప్రేక్షకుల్లో సీక్వెల్స్‌పై మంచి బజ్ క్రియేట్ అవుతూ వుంటుంది. కానీ `కార్తికేయ 2` టీమ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేయడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. నిఖిల్ హీరోగా, చందూ మొండేటి తెరకెక్కించిన సినిమా 'కార్తికేయ-2'. ఇది కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కార్తికేయలో నిఖిల్‌కు జోడీగా కలర్స్ స్వాతి నటించగా.. ఇప్పుడు ఆ పాత్రలో అనుపమను చూసిన ప్రేక్షకులలో అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.

కలర్స్ స్వాతి వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆ కారణంతోనే తనను సినిమాలో తీసుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే నిఖిల్ వీటిపై వివరణ ఇచ్చాడు. ''సినిమాల్లో కలర్స్ స్వాతి నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా హీరో క్యారెక్టర్ మెడిసిన్ పూర్తి చేసిన తరువాత మరో మిస్టరీని ఛేధించడం కోసం మరో చోటికి బయలుదేరుతుంది. పార్ట్ 2లో కథ మలుపు తిరుగుతుంది. కాబట్టి దీనికి నార్త్ ఇండియన్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలని అనుపమను తీసుకున్నాం. అంతే కానీ స్వాతిని కావాలని తప్పించలేదు. స్వాతిని సినిమాలో తీసుకోలేనందుకు ఏం అనుకోవద్దు అంటూ'' స్వాతి విషయంలో వస్తున్న వార్తాలకు చెక్ పెట్టాడు.

Next Story

Most Viewed