పడుకునేందుకు మంచి ప్లేస్ కావాలి.. అభిమాని ట్వీట్‌పై నటి ఫైర్

by Disha Web Desk |
పడుకునేందుకు మంచి ప్లేస్ కావాలి.. అభిమాని ట్వీట్‌పై నటి ఫైర్
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ స్వరా భాస్కర్.. తనపై జోక్ వేసిన నెటిజన్‌కు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది. అంతేకాదు తాను బదులిచ్చినట్లు మిగతా అబ్బాయిలకు చూపించుకోమంటూ కౌంటర్ ఇచ్చింది. విషయానికొస్తే.. స్వరా భాస్కర్ తన అప్‌కమింగ్ మూవీ 'జహా చార్ యార్' విడుదల(సెప్టెంబర్ 16) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ నెట్టింట పోస్టర్ షేర్ చేసింది. ఇది కాస్త వైరల్ అవడంతో స్పందించిన ఓ అభిమాని.. 'మీకు స్వాగతం. ప్రస్తుతం మా అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి నిద్రించడానికి ప్రశాంతమైన స్థలం దొరకట్లేదు. మీ సినిమా విడుదలైతే వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నా.

ఎందుకంటే థియేటర్‌లో ఎవరి గోల ఉండదు. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది' అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ఫన్నీగా రియాక్ట్ అయిన నటి.. 'హా.. హా! మీరు చాలా ప్రాక్టీస్ చేసి, రిహార్సల్ చేసిన జోక్‌ను ల్యాండ్ చేయడానికి ట్విట్టర్ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను కూడా ప్రత్యుత్తరం ఇచ్చానని మీలాంటి అబ్బాయిలకు చూపించండి' అంటూ తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed