టీమిండియా మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం..!

by Disha Web |
టీమిండియా మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం..!
X

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సురేశ్ రైనా ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు. చెన్నై నాకు సొం‍త ఇల్లు వంటింది అని.. ఈ గౌరవం నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు. సురేశ్ రైనా భారత్ తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడాడు.


కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed