పింఛన్‌ రాలేదని వృద్ధుడి ఆత్మహత్య..

by Disha Web Desk 13 |
పింఛన్‌ రాలేదని వృద్ధుడి ఆత్మహత్య..
X

దిశ, నిజామాబాద్ రూరల్: సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వారికి నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 60 ఏండ్ల వారికి కూడా పింఛన్ అందక ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి దుర్ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం డిచ్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్ పల్లి గ్రామానికి చెందిన నారం పెద్ద గంగారాం(62) 60 ఏళ్లు నిండిన తనకు పింఛన్ రావడం లేదు. దానికి తోడు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం రాత్రి ఇంట్లో వారందరూ నిద్రిస్తున్న సమయంలో తాను కట్టుకునే పంచతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నిరుపేదలో ఉన్న నారం పెద్ద గంగారాం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పింఛను మంజూరు చేస్తానని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కొడుకు నారం దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రాథమిక పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ గణేష్ వివరించారు.

Next Story

Most Viewed