విద్యార్థులకు చదువుతో పాటు అది అవసరమే: వైద్యులు బీఎల్ఎన్ రెడ్డి

by Disha Web |
విద్యార్థులకు చదువుతో పాటు అది అవసరమే: వైద్యులు బీఎల్ఎన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామం తప్పనిసరిగా అవసరమని ప్రముఖ వైద్యులు బీఎల్ఎన్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, కావేటి శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డాక్టర్స్ డేలో వైద్యులతో పాటు నిర్మల్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా వ్యాయామం చేయాలని.. సెలవు రోజుల్లో ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు సైకిల్ మీద వస్తే.. వ్యాయామం చేసినట్లవుతుందన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే నానుడిని గుర్తించుకోవాలని.. ఆరోగ్యంగా లేకుంటే ఎంత మంచి స్థాయికి ఎదిగినా.. అందులో రాణించలేమన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో కూడా ఉత్తమ ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుందన్నారు. చిన్న నాటి నుంచి ఏదో ఒక వ్యాయామం అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా వైద్యులతో పాటు ఎన్‌సీసీ సభ్యులను వాసవి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ పోతారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ సభ్యులు, డి.భరత్, చిన్నారెడ్డి, రమణారెడ్డి, శరత్, రాజ్ కుమార్, సాయినంద్, తేజా, రాజేశ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed