అనుమతిలేని కోచింగ్ సెంటర్ మూసివేయాలి.. విద్యార్థి సంఘాల ధర్నా

by Dishafeatures2 |
అనుమతిలేని కోచింగ్ సెంటర్ మూసివేయాలి.. విద్యార్థి సంఘాల ధర్నా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ కార్పొరేట్ కోచింగ్ సెంటర్ 'ఆకాశ్' ప్రభుత్వ అనుమతులు లేకున్నా విద్యార్థులను చెర్చుకోని తరగతులు నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం వినాయక్ నగర్‌లోని ఆకాశ్ కోచింగ్ సెంటర్‌లో టీవీయువీ, NSUISFI, టీజీవీపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించి తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా టీవీయువీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రామావత్ లాల్ సింగ్ యన్‌యస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, యస్‌యఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అనిల్ టీజీవీపీ జిల్లా నాయకులు కళ్యాణ్ మాట్లడుతూ.. ఆకాష్ కోచింగ్ సెంటర్ అనుమతి లేకుండా ఎంసెట్, నీట్ ,జేఈఈ కోచింగ్ సెంటర్ పేరిట లాభార్జనే ధ్యేయంగా కనీస నిబంధనలు పాటించడం లేదని అన్నారు. నిర్మాణ దశలోనే ఉన్న ఆకాష్ కోచింగ్ సెంటర్ అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తు, పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

గతంలో డిఈఓ, ఎంఈఓలు తనిఖీ చేసి మెమోలు జారీ చేసినా ఎలా తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్‌కు కనీసం విద్యాశాఖ అనుమతి లేకుండా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారని నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య వాగ్వివాదం జరిగింది. నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆందోళన విరమించాలని కోరగా విద్యార్థి సంఘాలు ససేమిరా అన్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు ఆకాష్ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు



Next Story