Samantha: బలమైన శరీరం, దృఢమైన మనసు.. తగ్గేదేలే అంటున్న సామ్

by Disha Web Desk 19 |
Samantha: బలమైన శరీరం, దృఢమైన మనసు.. తగ్గేదేలే అంటున్న సామ్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఒకవైపు లీడ్ రోల్స్‌తోపాటు, హీరోయిన్‌గా పలు ప్రాజెక్టులకు సైన్ చేస్తున్న సామ్.. మరోవైపు ఐటెం సాంగ్స్‌కు కూడా రెడీ అంటోంది. ఇదిలావుంటే.. బాడీ ఫిట్‌నెస్ కోసం సమంత తెగ కష్టపడుతోంది. దీనికి సంబంధించిన వర్కవుట్ వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నటి.. తాజాగా మరో వీడియోతో అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.

ఈ మేరకు 2022-23 సంవత్సరం తన బాడీ, మైండ్‌ ఛాలెంజింగ్‌గా ఉండబోతున్నట్లు పేర్కొంది. అంతేకాదు జిమ్‌లో చాలా బరువులు ఎత్తుతూ వర్కవుట్స్ చేస్తున్న సమంత.. ఒక్కో అడుగు ముందుకేస్తున్నానని తనలాగే ఫ్యాన్స్ కూడా ఫిట్‌గా ఉండాలని కోరింది. అయితే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి హెవీ వర్కవుట్స్ చేయాలని సూచించగా ఈ లేటెస్ట్ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed