ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. రైల్వే స్టేషన్లలో ఆధునిక నిఘా నేత్రాలు

by Jakkula.Mamatha |

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపరేషన్ యాత్రి సురక్ష కింద అత్యాధునిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపరేషన్ యాత్రి సురక్ష కింద అత్యాధునిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది.

ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. రైల్వే స్టేషన్లలో ఆధునిక నిఘా నేత్రాలు
X

దిశ, సికింద్రాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగిన వేళ, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపరేషన్ యాత్రి సురక్ష కింద అత్యాధునిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ 500 సీసీటీవీ కెమెరాలు, 100 సోలార్ కెమెరాలు, 15 బాడీ-వోర్న్ కెమెరాలతో రియల్‌టైమ్ నిఘా కొనసాగిస్తోంది. డ్రోన్లు, సెగ్‌వే వాహనాలతో ప్రత్యేక బృందాలు స్టేషన్లలో పర్యవేక్షణ చేపడుతుండగా, 20 కీలక రాత్రి రైళ్లు, 16 సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు. ఈ చర్యల ఫలితంగా 78 మంది నేరస్తులను గుర్తించి జీఆర్పీకి అప్పగించగా, 3,000 మందికి పైగా అనధికార ప్రవేశాలను అడ్డుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనిస్తే వెంటనే 139 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఆర్పీఎఫ్ సూచించింది. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే మా ప్రధాన లక్ష్యం అని సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అలకుంట నవీన్ కుమార్ తెలిపారు.

Next Story