కుక్కల దాడిలో లేగదూడ మృతి

by S Gopi |
కుక్కల దాడిలో లేగదూడ మృతి
X

దిశ, ఆమనగల్లు /కడ్తాల్: కడ్తాల్ మండల పరిధి రావిచేడ్ గ్రామంలో కుక్కల దాడిలో లేగదూడ మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన అండేకార్ రవికి చెందిన లేగదూడను కుక్కలు దాడి చేసి చంపాయి. రైతు రవి తెలిపిన వివరాల ప్రకారం.... పాడి ఆవుల వద్ద ఉన్న ఒక సంవత్సరం లేగదూడపై వీధి కుక్కలు దాడి చేయడంతో లేగదూడ మృత్యువాత పడిందని, రూ.10 వేల నష్టం వాటిల్లిందని, గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story