శ్రీలంకలో పెట్రో నిల్వల కొరత, వారం రోజులుగా లైన్లలో వేచిఉన్న ప్రజలు

by Dishanational1 |
శ్రీలంకలో  పెట్రో నిల్వల కొరత, వారం రోజులుగా లైన్లలో వేచిఉన్న ప్రజలు
X

కొలంబో: శ్రీలంకను ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటం లేదు. తాజాగా ఆ ప్రభావం ఇంధనాలపై పడింది. శ్రీలంకలోని ట్రూప్స్‌లో సోమవారం చాలా మంది ప్రజలు పెట్రోల్ కోసం క్యూలో వేచి ఉన్నారు. దాదాపు మూడు, నాలుగు రోజులుగా పెట్రోల్ కోసం క్యూలో నిలబడి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్ కొరత ఏర్పడటంతో అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ దేశంలో నివసిస్తున్న 22 మిలియన్ల జనాభాకు తినడానికి తిండి, మెడిసిన్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ వద్ద క్యూలో నిలబడిన ఓ వ్యక్తి తన గోడును చెప్పుకున్నాడు. గత నాలుగు రోజులుగా క్యూలైన్లలో నిల్చున్నామని, సరైన తిండి లేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. తనకు వచ్చే సంపాదనతో తన కుటుంబానికి సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నానని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగులకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్క్ ఫ్రం కొనసాగించాలని పేర్కొంది. మరోవైపు శ్రీలంకకు 3 బిలియన్ డాలర్ల సాయం అందించేందకు అంతర్జాతీయ మానిటరీ ఫండ్ బృందం శ్రీలంకలో పర్యటనలో ఉంది.


Next Story

Most Viewed