నేరాలను నియంత్రించేందుకు ఇది చాలా అవసరం: ఎస్పీ కోటిరెడ్డి

by Gopi |
నేరాలను నియంత్రించేందుకు ఇది చాలా అవసరం: ఎస్పీ కోటిరెడ్డి
X

దిశ, వికారాబాద్: జిల్లాకు ఎస్‌బీ అనేది నేత్రం లాంటిది, నేరాలను ముందుగానే పసిగట్టి వాటిని నివారించేందుకు ఎంతగానో సహకరిస్తుందని జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి అన్నారు. శనివారం ఎస్పీ అధ్యక్షతన ఎస్‌బీ, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌బీ, సీసీఎస్, టాస్క్ ఫోర్స్ ఈ మూడు ఫోర్స్ ఒకే తాటిపైన పనిచేస్తేనే జిల్లాలో నేరాలను అరికట్టవచ్చని అన్నారు. జిల్లా కర్నాటక రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి అక్కడి నేరస్థులు మన జిల్లాలో నేరాలు చేసే అవకాశం ఉంటుంది. కావున చాలా అప్రమత్తంగా ఉండాలని, నేరస్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని వారికి సూచించారు.

ఎమ్ఓ క్రిమినల్స్ పైన నిఘా ఉంచాలని, కొంతమంది నేరస్థులు నేరాలకు అలవాటుపడి మళ్లీమళ్లీ నేరాలు చేస్తుంటారని, అటువంటివారిపైన పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు పీడీఏ రైస్, గెమింగ్, గుట్కా, మట్కా మొదలగు వాటిపైన టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టారని, ఇవే కాకుండా ఇకముందు ఇతర వాటిపైన కూడా నిఘా పెట్టాలన్నారు. జిల్లాకు ఎస్‌బీ అనేది నేత్రం లాంటిదని.. నేరాలను ముందుగానే పసిగట్టి వాటిని నివారించేందుకు ఎంతగానో సహకరిస్తుందని, పోలీస్ వ్యవస్థకు ఎస్‌బీ అతి ముఖ్యమని.. అందువల్ల జిల్లాలోని ఎస్‌బీ సిబ్బంది అందరూ ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కి వెళ్లితే న్యాయం జరుగుతుంది అనే భరోసా, నమ్మకం వారిలో కలిగేలా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యను తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సిబ్బంది యొక్క విధుల గురించి వివరించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం‌ఏ రషీద్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర రావు, శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశం, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు దాసు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అప్పయ్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed