- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవరకొండ సీఐ కార్యాలయంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, దేవరకొండ టౌన్ : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు కీలక రికార్డులను ఆయన సవివరంగా పరిశీలించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, పెండింగ్ దర్యాప్తు ఫైళ్లను నిశితంగా తనిఖీ చేశారు. హత్యలు, దోపిడీలు, మహిళలు, చిన్నారుల పై జరుగుతున్న నేరాల కేసుల పురోగతి పై ఎస్పీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే ఛేదించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులోనూ పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి, నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడేలా దర్యాప్తు సాగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
సీసీటీఎన్‌ఎస్ నమోదు, డిజిటల్ రికార్డుల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్టు డిస్పోజల్ కేసులు, వారెంట్ల అమలు తీరు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ సీఐ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ తీరు పై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని ఎస్పీ హెచ్చరించారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. పోలీసుల పనితీరు పై ప్రజల్లో నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. నేర నియంత్రణ, ప్రజాభద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.






