ఐర్లాండ్‌కు గంగూలీ!

by Disha Web |
ఐర్లాండ్‌కు గంగూలీ!
X

న్యూఢిల్లీ : ఒకవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో సీనియర్లు ఇంగ్లాండ్‌ టూర్‌కు వెళ్లగా.. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ భారత్ ఐర్లాండ్‌లో పర్యటించనుంది. సౌతాఫ్రికా ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు గురువారం ఉదయం ఐర్లాండ్ బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డుబ్లిన్ వేదికగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ ఈ నెల 28వ తేదీన అదే వేదికగా జరగనుంది. అయితే, ఈ సిరీస్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు బీసీసీఐ చీఫ్ గంగూలీ ఐర్లాండ్ వెళ్లనున్నాడు. శనివారం దాదా ఐర్లాండ్‌కు బయల్దేరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిరీస్ ముగియగానే గంగూలీ అక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఆతిథ్య జట్టుతో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూలై 1 నుంచి 5వ తేదీలపై జరగనుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని దగ్గరి నుంచి చూసేందుకు గంగూలీ ఐర్లాండ్ పర్యటన చేయనున్నట్టు తెలుస్తున్నది. కాగా, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉండటంతో ఐర్లాండ్‌లో యువ భారత్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Next Story