చచ్చిపోతానని డాక్టర్లు చెప్పిన భయపడలేదు.. సోనాలి

by Harish |
చచ్చిపోతానని డాక్టర్లు చెప్పిన భయపడలేదు.. సోనాలి
X

దిశ, సినిమా: ప్రముఖ నటి సోనాలి బింద్రే ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను జయించి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేసింది. అనారోగ్యం కారణంగా నాలుగేళ్లపాటు కనిపించకుండా పోయిన నటి.. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5' (DIDLM-5) షోకి జడ్జిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీవీ షో నేటి నుంచి టెలికాస్ట్‌ కానుండగా తాజాగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన నటి.. నాలుగేళ్ల కాలంలో జీవితం విలువ తెలిసిందంటూ భావోద్వేగానికి లోనైంది. 'క్యాన్సర్‌ వల్ల శారీరకంగానే కాదు మానసికంగానూ ఎంతో మార్పు వచ్చింది. ఈ రోగం జయించడం ఆషామాషీ కాదు. మానసిక ధైర్యం చాలా అవసరం. 30 శాతమే బ్రతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినా.. మనోధైర్యంతో మృత్యువుతో పోరాడి మీ ముందుకు వచ్చాను. మళ్లీ మీతో సంతోష క్షణాలను పంచుకుంటున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది' అని చెప్పింది. అలాగే తను కోలుకోవాలని కోరుకున్న పేరెంట్స్, సన్నిహితులు, ఫ్యాన్స్, సహనటులందరికి ధన్యవాదాలు తెలిపింది.

Next Story

Most Viewed