విమాన భోజనంలో పాము తల.. (వీడియో)

by Disha Web |
విమాన భోజనంలో పాము తల.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భోజనం చేస్తున్న సమయంలో ప్లేట్‌లో చిన్న చెత్త ముక్క కనిపించినా చిరాకు వస్తుంది. కానీ ఇటీవల బిర్యాణీల్లో బల్లి, బొద్దింకలు బయటపడ్డుతున్న విషయం తెలిసిందే. భోజనం ప్లేట్‌లో పాము తల బయటపడటం చూశారా? పోనీ విన్నారా.. అది నిజమేనండి. తాజాగా, టర్కీలోని విమాన సిబ్బందికి ఇలాంటి అనుభవమే ఎదురయింది.

టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెడార్క్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో అందించిన ఆహారం తింటుండగా కూరలో పాము తల బయటపడింది. దానిని చూసిన వారంతా భయంతో హడలిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


Next Story

Most Viewed