- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేట నడిబొడ్డున పాము కలకలం.. బైక్‌లోకి దూరి హల్‌చల్!
జిల్లా కేంద్రంలో మంగళవారం పాము కలకలం రేపింది.

దిశ,సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మంగళవారం పాము కలకలం రేపింది. పట్టణంలోని బ్లూసీ కేఫ్ సమీపంలో ఓ బైక్‌లోకి కట్ల పాము చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బైక్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో పాము కనిపించడంతో బైకర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బైక్‌లోకి చేరిన పాము బయటకు రాకపోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పామును బయటకు రప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేశారు.
అయితే పాము బైక్‌లోని భాగాల్లో దాక్కోవడంతో దాన్ని బయటకు తీసేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో పాము ఒక్కసారిగా మొదటి బైక్ నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్న మరో బైక్‌లోకి చేరింది. దీంతో అక్కడ ఉన్న వారిలో మరింత ఆందోళన నెలకొంది. చివరకు స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి కర్రల సాయంతో పామును చంపారు. పాము మృతి చెందడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో అక్కడ భారీగా జనం గుమిగూడారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.






