మెరుగైన కుటుంబ ఆరోగ్యానికి స్మార్ట్ స్నాకింగ్.. బాదాంపే చర్యలో తేల్చిన నిపుణులు

by Dishafeatures2 |
మెరుగైన కుటుంబ ఆరోగ్యానికి స్మార్ట్ స్నాకింగ్.. బాదాంపే చర్యలో తేల్చిన నిపుణులు
X

దిశ, వెబ్‌డెస్క్: స్నాకింగ్.. చిరుతిండి..దీనిని చాలా వరకు పెద్ద బాడ్ హ్యాబిట్‌గా అందరూ చెప్తారు. చిరుతిండి కారణంగా ఊబకాయం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అసలు అనారోగ్యానికి మూల కారణం ఈ చిరుతుండే అని అనే వారు లేకపోలేదు. కానీ ఈ చిరుతిండి ద్వారా శరీరానికి కావలసిన మినరల్స్, పోషకాలను సమర్థవంతంగా అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబీకుల మెరుగైన ఆరోగ్యం కోసం స్మార్ట్ స్నాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందని వారు తెలుపుతున్నారు. దీని అవసరాన్ని తెలిపేందుకే ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా తాజాగా 'బాదాం పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో స్మార్ట్ స్నాకింగ్‌లో మన ఎంపికలు, ఆరోగ్యంపై వాటి ప్రభావాలను వారు చర్చించారు. వీటిలో ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సమ్యలపై జరిగింది.

ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం తదితర వ్యాధుల గురించి ప్రస్తావన జరిగింది. అయితే స్మార్ట్ స్నాకింగ్ ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్చలో బాలీవుడ్ ప్రముఖ నటి సోహా అలీఖాన్, న్యూట్రిషన్‌–వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌– ఢిల్లీ రీజనల్‌ హెడ్‌–డైటెటిక్స్‌ రితికా సమద్ధార్‌ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి వేస్తుంది. అది సర్వసాధారణం. ఆ సమయంలో మన ఆకలిని తీర్చుకునేందుకు మనం స్నాక్స్‌పై ఆధారపడతాం. అందులోనూ ఇప్పుడు ఫాస్ట్‌ఫుడ్ మరింత అందుబాటులోకి రావడంతో ఇది ఇంకా ఎక్కువ అవుతోంది. కాస్త ఆకలి అనిపించినా, బోర్‌గా ఫీలయినా వెంటనే ఫాస్ట్ ఫుడ్ తినేస్తున్నాం. దీని వల్ల మనకు అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి తప్పుకునేందుకు మనం ప్రత్యేక డైట్ ప్లాన్ చేసుకోవాలి.

స్నాకింగ్ సమయంలో జంక్ ఫుడ్ లేకుండా ప్రత్యేక శ్రద్ద వహిస్తాను. అలా చేయడం ద్వారా నాతో పాటు కుటుంబ సభ్యులూ ఆరోగ్యంగా ఉంటారు. స్నాక్ టైంలో జంక్ ఫుడ్ బదులుగా ఫ్రూట్స్, గింజలు, విత్తనాలు వంటివి ఉంచుతాను. అందులోనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా ఉండేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. వాటిలో బాదం ఒకటి. వీటిని నేను నా షూటింగ్ టైంలో కూడా నా వెంట తీసుకెళ్లగలుగుతాను' అని సోహా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చర్యలో పాల్గొన్న ఇతర నిపుణులు సైతం ప్రస్తుతం బిజీ లైఫ్‌లో జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు మన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

స్నాక్ టైంలో జంక్‌ ఫుడ్‌ను పోషకాలు ఉండే ఆహారంతో మార్చుకుంటే సరిపోతుంది. ఇందుకు మన ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెడితే సరిపోతుందని వారు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అత్యంత సులువుగా ఉండేలా ప్రతి ఒక్కరు తమ స్నాక్ టైంలో బాదాంలను ఉపయోగించుకోవచ్చు, వీటిని మనతో పాటు తీసుకెళ్లడం చాలా సులభం. దాంతో పాటుగా వీటిలో పోషకాలు, ప్రొటీన్‌లు, కేలరీలు సమృద్ధిగా ఉండటంతో పాటు మన ఆకలిని తీర్చడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. మన స్నాక్ టైంలో ఈ చిన్న మార్పులు చేసుకుంటే దీర్ఘకాలంలో మన అనారోగ్య విషయంలో పెను మార్పులకు కారణం అవుతాయని వారు అన్నారు.


Next Story

Most Viewed