బస్తీ దవాఖాన కోసం స్థలం పరిశీలన

by Gopi |
బస్తీ దవాఖాన కోసం స్థలం పరిశీలన
X

దిశ, వికారాబాద్: ప్రతి జిల్లాలో బస్తీ దవాఖానను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమెతోపాటు శివరెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ పాండు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక నాయకులు పరిగి నర్సింలు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed