ప్రజలకు కమిషనర్ వార్నింగ్.. ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదు..

by Dishafeatures2 |
ప్రజలకు కమిషనర్ వార్నింగ్.. ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదు..
X

దిశ, వరంగల్ టౌన్: నియంత్రించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడిన వ్యక్తులకు జరిమానా తప్పదని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్లాస్టిక్ నిర్మూలనపై రూపొందించిన గోడ ప్రతిని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పి. ప్రావీణ్య శుక్రవారం ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 75 మైక్రాన్‌ల మందంలోపు గల ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించిందని, సింగిల్ యూస్ ప్లాస్టిక్‌కి పూర్తి స్థాయిలో స్వస్తి పలకాలని, దీనికి ప్రత్యామ్నాయంగా జ్యూట్‌, కాటన్‌, నాన్‌ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ బ్యాగులను వినియోగించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే జులై 1 నుండి నిషేదించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడిన వ్యక్తులకు 500 నుండి 5 వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాల్స్‌, వీధి వ్యాపారులు, పండ్లు విక్రయించే వారు కూడా నిబంధనల ప్రకారం ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకట్ రామ్ నర్సయ్య, బల్దియా సెక్రెటరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Next Story