కేసీఆర్‌పై పోలీస్ అధికారి బూతు పురాణం.. సంచలనం రేపుతున్న ఆడియో

by Disha Web |
కేసీఆర్‌పై పోలీస్ అధికారి బూతు పురాణం.. సంచలనం రేపుతున్న ఆడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు సమస్యలు వస్తే తమ విన్నపాలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పుకుంటారు. అప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు, పీఆర్సీ, డీఏల కోసం ధర్నాలు చేస్తూ ప్రభుత్వాలను ఇరుకున పెడుతూ ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ధర్నాలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే పోలీసులు మాత్రం తమ సమస్యల మీద ధర్నాలు చేయడం లాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. పోలీసులకు ఎన్నో సమస్యలున్నా కూడా బయటికి చెప్పుకోరు. తమ సమస్యలను మౌనంగా భరిస్తూ ఉంటూ పై అధికారుల దగ్గర తమ గొడును వెళ్లబోసుకుంటూ ఉంటారు. పైకి చెబితే ఉద్యోగాల నుంచి తీసివేస్తారనే భయంతో తమ ఇబ్బందులను బయటికి చెప్పుకోపలేక సమమతమవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పోలీసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రాష్ట్రంలో పోలీసులే బాధితులుగా మారిపోయారు. డీఏ, సరండర్ లీవుల బకాయిలు రాక కిందస్థాయి పోలీస్ సిబ్బంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కుటుంబ పోషణ, పిల్లల చదువులకు డబ్బులు లేక ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో తెలంగాణలో పోలీసుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ కానిస్టేబుల్ పై పోలీస్ అధికారికి ఫోన్ చేసి తమ ఆవేదనను వెళ్లగక్కాడు. మూడు నెలలుగా సరెండర్లు పడలేదని, డీఏలు విడుదల చేయకపోవడంతో పిల్లల చదువులకు డబ్బులు లేవంటూ బాధపడ్డాడు. చైతన్య స్కూల్‌కి వెళితే తనను, తన పిల్లలను మెడ పట్టుకుని బయటకు గెంటేశారని, ఎలా బ్రతకాలంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. తమ బాధలను ఎవరితో చెప్పుకోవాలని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలా? ఊరి వేసుకోవాలా? అంటూ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఏపీలో కానిస్టేబుల్స్ చేసినట్లు పెట్రోల్ పోసుకోవాలా? అంటూ ఆవేదన చెందాడు. కానిస్టేబుల్ మాటలతో ఆవేదనకు గురైన పోలీస్ అధికారి.. సీఎం కేసీఆర్‌పై బూతు పురాణం అందుకున్నాడు. రాయడానికి కూడా వీలు కాని మాటలతో కేసీఆర్‌పై దమ్మెత్తిపోశాడు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదని, దాని కోసమే చర్చలు జరపడానికి హైదరాబాద్ వచ్చానంటూ కానిస్టేబుల్‌కు సర్ధిచెప్పాడు. కానిస్టేబుల్, పోలీస్ అధికారి ఆడియో కాల్ బయటకు లీక్ అవ్వడంతో.. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై పోలీసుల్లో ఎంత ఆక్రోశం ఉందో ఈ ఆడియో కాల్ ను బట్టి తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed