రేపే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

by Disha Web |
రేపే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) నేడు ఆదివారం ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 538 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 503 పరీక్షా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఈ ప్రిలిమ్స్ పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం సెంటర్ దగ్గరికి ఆలస్యంగా వచ్చిన ఎంట్రీ ఉండదని పోలీస్ బోర్డు తెలిపింది. అభ్యర్థులు హాల్ టికెట్‌పై పాస్ పోర్ట్ సైజు ఫోటో అంటించుకొని రావాలి, పిన్ చెయకుడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు. అభ్యర్థులు హాల్ టికెట్, బ్లూ లేద బ్లాక్ పెన్ మాత్రమే తీసుకురావాలి. మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దు బయో మెట్రిక్ తప్పనిసరి అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.

Next Story

Most Viewed