- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అభిమానులకు షాకింగ్ న్యూస్!.. విడాకులు తీసుకోబోతున్న విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ?
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు, క్రికేటర్స్‌కు విడదీయరాని బంధం ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. వీరు కలిసి జంటగా యాడ్స్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు కూడా చాలానే ఉన్నాయి. వారిలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది మాత్రం విరాట్- అనుష్క్ శర్మల గురించే. ఈ కపూల్‌ని ప్రేమగా విరుష్క జంట అని పిలుచుకుంటారు అభిమానులు. ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే.. ఈయనకు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక చెరిగిపోని గుర్తింపు ఉంది. ఈయన పేరు తెలియని వారు ఉండరు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన క్రికెట్ ఆటతో మెప్పించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో కూడా నటించి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక అలాంటి విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్క శర్మతో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఒక పాప బాబు కూడా జన్మించారు.
ఇదిలా ఉంటే.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి ఇలా చక్కర్లు కొట్టడానికి మెయిన్ రీజనే ఉందండోయ్. అదేంటంటే రీసెంట్‌గా విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు ఇద్దరు ఒకరిపై ఒకరు హేళన చేసుకునే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ఇక ఈ పోస్టులు చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఇద్దరు భార్య భర్తలు ఒకరిని ఒకరు కించపరుచుకున్నట్టు పోస్టులు పెట్టారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం వైరల్ అయిన కొద్దిసేపటికే మరికొంతమంది జనాలు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే ఒకరిని ఒకరు అవమానించుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ చేశారు. దీంతో వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇక ఈ వార్తలు విన్న అభిమానులు కొట్టి పారేస్తుంటే మరికొంత మందేమో ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకైతే ఈ జంట స్పందించలేదు. ఏదిఏమైనప్పటికి ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
(సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఈ వార్త రాయడం జరిగింది. 'దిశ' దీనిని ధృవీకరించడం లేదు..)