నేషనల్ హెరాల్డ్ కేసులో మరో ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన ఈడీ

by Disha Web Desk |
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన ఈడీ
X

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో భాగమైన యంగ్ ఇండియన్ కంపెనీతో అనేక షెల్ కంపెనీలు నగదు లావాదేవీలు నిర్వహించాయని ఈడీ సంచలన వార్తను బయటపెట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసుల దర్యాప్తులో భాగంగా పలు షెల్ కంపెనీల వివరాలను ఈడీ రాబట్టింది. ఈ షెల్ కంపెనీలు యంగ్ ఇండియన్ కంపెనీతో నేరుగా లావాదేవీలు జరిపినట్లు ఈడీ కనుగొంది. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే డోటెక్స్ మర్కండైజ్ మాత్రమే కంపెనీతో లావాదేవీలు చేసినట్లుగా పబ్లిక్ డొమెయిన్‍లో ఉంటోందని ఈడీ తెలిపింది.

ఈ సందర్భంగా హవాలా ట్రాన్సాక్షన్ ఆపరేటర్ల కోసం లావాదేవీలు జరిపిన పలు షెల్ కంపెనీల పనితీరును ఈడీ పరిశీలించింది. అలాగే యంగ్ ఇండియన్ కంపెనీ తరపున ఆర్థిక లావాదేవీలను కాంగ్రెస్ దివంగత నేత మోతీ లాల్ వోరా నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని ఈడీ తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, మోతీలాల్ వోరా మాత్రమే వీటిని పట్టించుకునే వారంటూ గతంలో రాహుల్, సోనియా గాంధీ ఈడీ ముందు స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సోనియా, రాహల్ గాంధీలను విచారణకు ఈడీ సమన్లు పంపడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed