పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తల్లిపాల బ్యాంక్

by Disha Web Desk 2 |
పూర్తి స్ధాయిలో అందుబాటులోకి తల్లిపాల బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ పట్టణంలోని ప్రశాంతి హాస్పిటల్‌లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని శనివారం ఐదవరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల నిధి ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి IAP ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కరుణాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పిటల్ చీఫ్ Neonatologist డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ.. తల్లిపాల నిధి యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. అధికంగా పాలు వస్తున్న తల్లలు తమ పాలను మిల్క్ బ్యాంక్‌లో దానం చేయాలని కోరారు. ఈ పాలను వివిధ కారణాల వల్ల తల్లులకు దూరమైన పిల్లలకు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. తద్వార ఇతరులకు మేలు చేసిన వారు అవుతారని వెల్లడించారు. ఇలాంటి తల్లిపాల నిధిని వరంగల్‌లో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.

Next Story