"RRR" కు సీక్వెల్..! రాజమౌళి మదిలో ఏముందో..?

by Mahesh |
RRR కు సీక్వెల్..! రాజమౌళి మదిలో ఏముందో..?
X

దిశ, వెబ్ డెస్క్: భారీ అంచనాలతో "RRR" మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి రాజమౌళి స్పెషల్ మార్క్ ఉన్న సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తెగ వేచి చూశారు. కరోనా కారణాల వల్ల పలు మార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ సినిమా రాజమౌళి మార్క్ తో, ఎన్టీఆర్, రామ్ చరణ్ నట విశ్వరూపం తో మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ..గత రికార్డులను బద్దలు కొడుతుంది.

అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ యాక్షన్ డ్రామా కు సీక్వెల్ చేయాలని సోషల్ మీడియా వేదికగా తెగ డిమాండ్ చేస్తున్నారు. కానీ గతంలోనే రాజమౌళి ఈ చిత్రం సింగిల్ పార్ట్ మూవీ అని చెప్పారు. అయితే అభిమానుల నుంచి వస్తున్న డిమాండ్‌కు రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed