లాభాల నుంచి నష్టాల్లోకి సూచీలు!

by Disha Web |
లాభాల నుంచి నష్టాల్లోకి సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. గత నాలుగు సెషన్లుగా లాభాల్లో కదలాడిన సూచీలు బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం భారీ నష్టాలతో మొదలైనప్పటికీ క్రమంగా మెరుగుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా ఉదయం దెబ్బతిన్న తర్వాత మిడ్-సెషన్ సమయంలో కోలుకున్న స్టాక్ మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా తిరిగి పతనమయ్యాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు, వడ్డీ రేట్ల పెంపు, ముడి చమురు ధరల నిరంతర పెరుగుదల వంటి పరిణామాలను దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణంగా మదుపర్లు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 150.48 పాయింట్లు క్షీణించి 53,026 వద్ద, నిఫ్టీ 51.10 పాయింట్లు తగ్గి 15,799 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు 1 శాతానికి పైగా బలహీనపడ్డాయి. మెటల్, ఆటో రంగాలు సానుకూలంగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, రిలయన్స్, సన్‌ఫార్మా, ఆల్ట్రా సిమెంట్, ఐటీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకోగా, హిందూస్తాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, విప్రో, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 79.01 వద్ద ఉంది. రోజురోజుకు క్షీణిస్తున్న రూపాయి కరెన్సీ తొలిసారిగా రికార్డు పతనం రూ. 79కి చేరుకుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed