- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోక్సో కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో సిరిసిల్ల సంచలన తీర్పు వెలువరించింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: పోక్సో కేసులో సిరిసిల్ల సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ .5000/- జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను గోరింటాల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేయగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్‌కి తరలించారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరపున గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించగా.. శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన కోటగిరి శ్రీనివాస్ కి 20 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు, రూ.5000/-జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరు..
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుతం డీఎస్పీ నాగేంద్ర చారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను జిల్లా ఎస్పీ అభినందించారు.






