ఆ ప్లేయర్‌ను వదిలేయడం ఆర్సీబీకి అతిపెద్ద నష్టం: వీరేంద్ర సెహ్వాగ్

by Disha Web Desk 19 |
ఆ ప్లేయర్‌ను వదిలేయడం ఆర్సీబీకి అతిపెద్ద నష్టం: వీరేంద్ర సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో రిటెన్షన్ పాలసీ విధానం వల్ల ఫ్రాంచైజ్‌లు కీలక ఆటగాళ్లను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్యారా ప్రతి జట్టు నలుగురు ప్లేయర్ల చొప్పున అంటిపెట్టుకుని.. మిగితా వారిని విడిచిపెట్టాలి. దీనితో చాలా మంది కీలక ఆటగాళ్లను ఫ్రాంచైజ్‌లు కోల్పోవాల్సి వచ్చింది. జట్లు రిటెన్షన్ చేసుకోని ఆటగాళ్లు అందరూ వేలంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఆర్సీబీ జట్టు భారత స్టార్ స్పిన్నర్ చాహల్‌ను రిటైన్ చేసుకోలేదు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ' చాహల్‌ను రిటైన్ చేసుకోకపోవడం ఆర్సీబీకి అతిపెద్ద నష్టం. అతడు బెంగళూర్, దుబాయ్ పిచ్ లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఆ పిచ్‌లపై అతడు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు.. అత్యధిక వికెట్లు సాధించేవాడు. చాహల్ అత్యుత్తమ ఆటగాడు. నేను ఆర్సీబీ‌లో భాగమైతే.. చాహల్‌ను విడిచిపెట్టేవాడిని కాదని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed