వ్యాయామంతో కండర బలం.. కొత్త జన్యువు గుర్తించిన సైంటిస్ట్స్

by Disha Web |
వ్యాయామంతో కండర బలం.. కొత్త జన్యువు గుర్తించిన సైంటిస్ట్స్
X

దిశ, ఫీచర్స్ : వ్యాయామం కండరాలను బలపరచడమే కాక హెల్తీ లైఫ్‌కు తోడ్పడుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వర్కవుట్స్ చేస్తున్నపుడు మజిల్స్‌లో జరిగే స్పెసిఫిక్ మెకానిజం గురించి లోతుగా తెలియదు. ఈ క్రమంలోనే మెల్‌బోర్న్, కోపెన్‌హాగన్ యూనివర్సిటీ పరిశోధకులు.. వివిధ రకాల వ్యాయామాలకు ముందు, ఆ తర్వాత కండరాల్లోని మాలిక్యులర్ సిగ్నలింగ్ ప్రతిస్పందనలను పరిశోధించి ఓ జన్యువును గుర్తించారు. వ్యాయామం ద్వారా యాక్టివేట్ కాబడే ఈ జన్యువు కండర పుష్టికి సాయపడుతుందని పేర్కొన్నారు.

వర్కవుట్స్‌కు సంబంధించి జన్యువులు, ప్రొటీన్లు ఎలా యాక్టివేట్ అవుతాయో గుర్తించేందుకు స్ప్రింట్, రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్ సమయంలో కండరాల స్థితిపై అధ్యయనం చేశారు. ఈ మేరకు వ్యాయామాల తర్వాత కండరాల్లో సిగ్నలింగ్ ప్రతిస్పందనలు ఎలా మారాయి? వ్యక్తుల పరిధిలో ఆ మార్పులు ఎంత స్థిరంగా ఉన్నాయో బృందం విశ్లేషించింది. ఈ పరిశీలనల నుంచి 'C18ORF25'గా పిలవబడే జన్యువును గుర్తించారు. వ్యాయమ సమయంలో తరచుగా యాక్టివేట్ అవుతున్న జన్యువుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ఈ జీన్ లేని ఎలుకలను ఇంజనీరింగ్ చేసినప్పుడు.. 'స్మాలర్ స్కెలిటల్ మజిల్ ఫైబర్స్'ను అభివృద్ధి చేశాయి. ఇవి బలహీనమైన కండరాలకు ట్రాన్స్‌లేట్ కావడం సహా వ్యాయామ పనితీరును తగ్గించాయి. దీనికి విరుద్ధంగా అవి జన్యు కార్యకలాపాలను పెంచినప్పుడు, జంతువుల కండరాలు బలంగా మారాయి.

'ఈ జన్యువును గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, కండర క్షీణత వ్యాధులపై ఓ అవగాహనకు రావచ్చు. పశువుల్లో మాంస ఉత్పత్తి నిర్వహణను ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే కండరాల సరైన పనితీరుతోనే మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. నిజానికి మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను వ్యాయామం నివారించగలదని తెలసిందే. ఇప్పుడు, వివిధ రకాల వ్యాయామాలు.. పరమాణు స్థాయిలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ప్రభావాలను ఎలా పొందుతాయో అర్థం చేసుకోవడం ద్వారా కొత్త, మెరుగైన చికిత్సా ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

- డాక్టర్ పార్కర్, కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం


Next Story

Most Viewed