ఆ సమయంలో కంట్రోల్ చేసుకోలేకపోయా : సంయుక్త

by Disha Web Desk |
ఆ సమయంలో కంట్రోల్ చేసుకోలేకపోయా : సంయుక్త
X

దిశ, సినిమా : కన్నడ హాట్ బ్యూటీ సంయుక్త హెగ్డే ఇటీవల షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా గాయపడినట్లు ఇటీవలే వెల్లడించిన నటి.. అభిమానుల దయతో త్వరగానే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫైట్ చేస్తూ పడిపోయిన వీడియోను నెట్టింట షేర్ చేసిన బ్యూటీ.. 'జంప్ చేస్తూ జారిపోయాను. గాలిలోకి ఎగిరిన తర్వాత బాడీని కంట్రోల్ చేయలేకపోయాను.

దీంతో మోకాలిపై భారం పడింది. చిన్నగా బెణికిందని అనుకున్నప్పటికీ ఎక్స్-రే తీస్తే కండరం కాస్త దెబ్బతిందని డాక్టర్లు చెప్పారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ షూటింగ్ పూర్తయ్యేందుకు ఇంకా ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. అప్పుడే ఇలా జరగడం కాస్త బాధగా ఉంది' అంటూ నోట్ షేర్ చేసింది. అయితే తన గాయంపై మూవీ టీమ్ సభ్యులంతా సానుకూలంగా స్పందించారన్న ఆమె.. త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed