Samantha: మీడియా ముందుకు సమంత.. విడాకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుందా ?

by Dishanational2 |
Samantha: మీడియా ముందుకు సమంత.. విడాకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుందా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ సమంత. తొలి సినిమాతోనే ప్రేమలో పడి పోయిన ఈ అమ్మడు, నాగచైతన్యను వివాహం చేసుకుని.. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సామ్‌గాని, చైతూ కానీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ఇంతకముందు ఒకానొక సందర్భంలో.. నాగచైతన్య విడాకులపై స్పందిస్తూ, పరస్పర నిర్ణయంతో విడాకులు తీసుకున్నాం.. ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా ఉన్నామని తెలిపారు. కానీ సామ్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఇక సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో రాబోయే చిత్రం కాథువాక్కుల రెండు కాదల్ సినిమా ప్రమోషన్ల లో భాగంగా సమంత మీడియా ముందుకు రావడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే విడాకుల గురించి నార్త్ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు సమంత దానిని నేర్పుగా దాటవేసిందట. కానీ సౌత్ మీడియా ఆమెను తేలికగా వదిలిపెట్టదని, విడాకులకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సామ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా‌గా ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో సామ్, నయనతార సంయుక్తంగా ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed