కరణ్ జోహార్ క్యాంప్‌లో సమంత!

by Disha Web |
కరణ్ జోహార్ క్యాంప్‌లో సమంత!
X

దిశ, సినిమా : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా తనదైన ముద్ర వేయాలనుకుంటున్న సామ్‌కు కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్ షో' చాలా ప్లస్ అయింది. ఈ షో ఆమెను హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. తాజా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్‌తో కరణ్ నిర్మించనున్న తదుపరి చిత్రం కోసం ఫిమేల్ లీడ్‌గా సమంతను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో కరణ్ జోహార్ స్టారింగ్ లిస్ట్‌లో సామ్ కూడా చేరిపోయినట్లయింది. ఇక 'లైగర్‌‌'తో విజయ్ దేవరకొండను బాలీవుడ్‌లో లాంచ్ చేస్తున్న కరణ్.. ఓ రకంగా నార్త్, సౌత్ ఇండస్ట్రీల మధ్య అంతరాన్ని తగ్గించాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. కరణ్ 50వ పుట్టినరోజు వేడుకకు హాజరైన కొద్దిమంది అతిథుల్లో రష్మిక కూడా ఉండగా.. ఆమె కూడా ఈ క్యాంప్‌లో భాగమైపోయిందని అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తే కరణ్ టాలీవుడ్ ముద్దుగుమ్మలకు మంచి మంచి ఆఫర్స్‌తో సర్‌ప్రైజ్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.


Next Story

Most Viewed