ఫ్రెండ్​ ఇంటికి వెళ్తూ.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి

by Vinod kumar |
ఫ్రెండ్​ ఇంటికి వెళ్తూ.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి
X

దిశ, కూకట్​పల్లి: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఓ సేల్స్​మెన్​ మృతి చెందిన సంఘటన కూకట్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్​పల్లి ఎస్సై సురేష్​తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన షేక్​యూసుఫ్​ (26) మియాపూర్​లోని బజాజ్​ఎలక్ట్రానిక్స్​షోరూం లో శాంసంగ్ ​మొబైల్స్​సేల్స్​మెన్​గా పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి యూసుఫ్​బోరబండలోని తన ఫ్రెండ్​ఇంటికి వెళ్తున్నాను రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తానని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు స్నేహితుడి ఇంటి నుంచి యూసుఫ్ తన TS​-10-BF-​8062 నంబర్ హోండా యాక్టీవా వాహనంపై బయలుదేరాడు. మూసాపేట్​నుంచి బాలానగర్​ వైపుకు వెళ్తుండగా వై జంక్షన్​లో TS​-16-EK-7696 నెంబరు గల బజాజ్​అవెంజర్ ​వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో యూసుఫ్​ను ఢీకొట్టాడు.


ఈ క్రమంలో యూసుఫ్​ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి మూసాపేట్ నుంచి కూకట్​పల్లి వైపు వెళుతున్న కంటైనర్​తో లారీ వెనుక చక్రాల కింద పడటంతో లారీ చక్రాలు యూసుఫ్ ​శరీరంపై నుంచి వెళ్లింది. దీంతో యూసుఫ్​అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కూకట్​పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యూసుఫ్​మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యూసుఫ్​ మృతి చెందిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందించారు. యూసుఫ్​ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవెంజర్​వాహనం నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమై అవెంజర్ ​వాహనం నడుపుతున్న వ్యక్తి ప్రమాదం సమయంలో మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు దృవీకరించారు.

Next Story