రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయితో వివాహం

by Disha Web Desk |
రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయితో వివాహం
X

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోందన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో శత్రుదేశాలకు చెందిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. రష్యాకు చెందిన సెర్గీ నొవికొవ్ ఇజ్రాయిల్‌లో స్థిరపడ్డాడు. ఇతడు రెండేళ్లుగా ఉక్రెయిన్‌కు చెందిన ఎలోనా బ్రయోకాతో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గతేడాది నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసముంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో వీరిద్దరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. దీంతో ఆగస్టు 2న వీరిద్దరూ ఖరోటా గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. రామన్ శర్మ అనే అర్చకుడు వీరి వివాహాన్ని జరిపించారు. మంత్రాలు అర్థం కావడానికి ఒక ట్రాన్స్‌లేటర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వివాహానికి స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులు హాజరయ్యారు. స్థానిక వంటకాలతో విందును కూడా ఏర్పాటు చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed