ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఐఎంఎఫ్!

by Disha Web Desk 17 |
ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఐఎంఎఫ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక పతనంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. ఇదే సమయంలో చైనా పై యుద్ధ ప్రభావం తక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. భారత్‌కు సంబంధించి ప్రపంచ ఆర్థిక పతనం అనేక మార్గాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉండనుంది. ఇది కరోనా మహమ్మారి సమయంలో ఉన్న దాని కంటే భిన్నంగా ఉంటుందని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ గెరీ రైస్ అన్నారు.

ముందుగా గ్లోబల్ చమురు ధరల పెరుగుదల వాణిజ్య సవాళ్లను సూచిస్తుందని గెరీ రైస్ పేర్కొన్నారు. దీని తర్వాత అధిక ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటుకు దారి తీస్తుందన్నారు. ఇదే సమయంలో భారత్ ఎగుమతి చేసే వస్తువుల ధరల్లో అనుకూల అంశాలు కలిసొస్తాయని, గోధుమల ద్వారా కరెంట్ ఖాతా పై ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించవచ్చని ఐఎంఎఫ్ వివరించింది. సరఫరా అంతరాయాలు భారత దిగుమతులను, ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని గెరీ రైస్ వెల్లడించారు.

Next Story

Most Viewed