- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ గ్రౌండ్లో పీరియడ్స్ వస్తే? ICC లో అసలు రూల్స్ ఉన్నాయా??
మహిళల క్రికెట్లో పీరియడ్స్ అంశంపై ఎలాంటి రూల్స్ ఉన్నాయి? అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఏం చెబుతోంది అనే విషయాలను తెల్సుకుందాం.

దిశ, వెబ్ డెస్క్ : మహిళల క్రికెట్లో అత్యంత సున్నితమైన, శారీరకమైన అంశం పీరియడ్స్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో బహుశా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అసలు క్రికెట్లో పీరియడ్స్ అంశంపై ఎలాంటి రూల్స్ ఉన్నాయి? అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఏం చెబుతోంది అనే విషయాలను తెల్సుకుందాం. నిజానికి ICC లో మహిళా క్రికెటర్స్ పీరియడ్స్ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి రూల్స్ లేవు. క్రికెట్ గ్రౌండ్‌లో మహిళా క్రికెటర్లకు పీరియడ్స్ వస్తే ఆ సమయాల్లో మ్యాచ్‌లను మేనేజ్ చేయడం పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం, అలాగే జట్టు మెడికల్ స్టాఫ్ సపోర్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం దీని కోసం ప్రత్యేకంగా 'పీరియడ్స్ రూల్' అంటూ ఏమీ లేనప్పటికీ, దీనిని ఒక అనారోగ్యం లాగే పరిగణిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్, తీవ్రంగా నీరసం ఉంటే లేదా నాప్కిన్ మార్చికోవాల్సి వస్తే బ్యాటర్స్ కొద్దిసేపు మెడికల్ టైమ్‌అవుట్ తీసుకునే సదుపాయం ఉంటుంది.
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో నొప్పి భరించలేకపోతే సదరు క్రీడాకారిణి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఫీల్డ్ వెలుపలికి వెళ్లవచ్చు. ఆ సమయంలో రూల్స్ ప్రకారం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ (Substitute Fielder) మైదానంలోకి వస్తారు. ఒకవేళ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తితే, సదరు బ్యాటర్ 'రిటైర్డ్ హర్ట్' (Retired Hurt) గా వెనుదిరిగి, నొప్పి తగ్గిన తర్వాత లేదా వికెట్ పడినప్పుడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం క్రికెట్ చట్టాల్లో ఉంది. అయితే ఇదే విషయంపై టీమ్ ఇండియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ స్మృతి మందాన స్పందిస్తూ.. తాను ఒకసారి నాప్కిన్ మార్చుకోడానికి కొద్దిసేపు విరామం తీసుకోవాల్సి వచ్చింది. అపుడు నేను వైట్ జర్సీ వేసుకోవడంతో అంపైర్ కు అనుమతించడం తప్ప వేరే మార్గం లేదు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటివి కొన్ని తాము అందరం భరిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల మహిళా క్రికెటర్ల సౌకర్యం కోసం తెల్లటి ప్యాంట్ల బదులు ముదురు రంగు దుస్తులు వేసుకునేలా నిబంధనలను సడలిస్తున్నారు.






