- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏర్గట్ల మహిళా సమాఖ్యకు ఆర్టీసీ బస్సు కేటాయింపు
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ అన్నారు.

దిశ, ఏర్గట్ల : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ అన్నారు. ఏర్గట్ల మండల మహిళా సమాఖ్యకు రూ.36 లక్షల విలువైన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. మంగళవారం తడపాకల్ గ్రామం నుంచి మహిళలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బస్సుల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరగా, మహిళలు కొబ్బరికాయలు కొట్టి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ బస్సు ద్వారా మహిళా సమాఖ్యకు అదనపు ఆదాయం సమకూరుతుందని శివకుమార్ తెలిపారు.
అలాగే మండలంలోని ఆరు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. మహిళా సంఘాల వడ్డీలేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు బ్యాంకు రుణాలు, శ్రీనిధి ద్వారా అదనపు రుణాలు అందించడం వల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






