రూ. 20 వేలకు నవజాత శిశువు విక్రయం

by Disha Web Desk 12 |
రూ. 20 వేలకు నవజాత శిశువు విక్రయం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పుట్టిన బిడ్డను 24 గంటలు గడవక ముందే తల్లిదండ్రులు విక్రయించిన.. సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంచార జీవనం, ఉపాధి లేక పుట్టిన శిశువును పోషించే స్థోమత లేక అప్పుడే పుట్టిన శిశువును అమ్ముకున్న ఘటన శనివారం డిచ్ పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ్వ, కొమరయ్య దంపతులు సంచార జీవనం గడుపుతున్నారు. కొన్ని రోజులుగా గన్‌పూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి నగరంలో గుడారం వేసుకుని ఉంటున్నారు. నిండు గర్భిణి అయిన బిమవ్వకు ఇటివల డిచ్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ నార్మల్ డెలివరీ చేశారు.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం తో నివసిస్తున్న గుడారానికి వెళ్లారు. నవజాత శిశువును ఇతర వ్యక్తులకు 20 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న అంగన్వాడి, ఆరోగ్య సిబ్బంది దంపతులను ప్రశ్నించగా బండారం బయటపడింది. తమకు బిడ్డను పోషించే స్థోమత లేదని.. అందుకే తమ బంధువులకు ఇచ్చామని వారు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నవజాత శిశువు స్వాధీనం చేసుకుని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్‌పల్లి పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed