వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా రెడీ.. బీసీసీఐ క్లియరెన్స్!

by Malleboina Mahesh |

అఫ్గానిస్తాన్‌తో ఆదివారం నుండి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఎంపికయ్యారు. బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది.

వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా రెడీ.. బీసీసీఐ క్లియరెన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: వివిధ కారణాలతో రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా త్వరలో జరగనున్న వన్డే సిరీస్ (ODI series) కు అందుబాటులోకి రావడం లేదని వార్తలు వచ్చాయి కానీ తాజా పరిణామాలు టీమ్ ఫుల్ జోష్ నింపాయి. వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా రెడీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు బీసీసీఐ ఆ ఇద్దరు ప్లేయర్లకు క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వారు ఆఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)లు పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. బీసీసీఐ (BCCI) కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) స్పోర్ట్స్ సైన్స్ టీమ్.. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, వారు తిరిగి మైదానంలోకి దిగడానికి గ్రీన్ సిగ్నల్ (All-Clear) ఇచ్చింది.

ధర్మశాలలో తొలి వన్డే..

భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రాబోయే ఆదివారం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. గాయాలు, ఇతర కారణాలతో గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న రోహిత్, హార్దిక్‌లు ఈ సిరీస్‌తోనే మళ్లీ వన్డే ఫార్మాట్ లోకి పునరాగమనం (Return) చేయనున్నారు. ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు అందుబాటులోకి రావడంతో టీమిండియా బ్యాటింగ్, ఆల్ రౌండ్ విభాగాలు మరింత పటిష్టంగా మారాయి.

Next Story