ఏండ్లు గడిచినా ఎడ్లబండి బాటే దిక్కు....

by Dishanational1 |
ఏండ్లు గడిచినా ఎడ్లబండి బాటే దిక్కు....
X

దిశ, పలిమెల: పలిమెల మండలంలోని అప్పాజీపేటకు గ్రామానికి వెళ్లాలంటే మాత్రం మట్టిరోడ్డే దిక్కు. కిలోమీటర్ దూరంలో ఆ మట్టి రోడ్డు ఉంది. వానొస్తే రాకపోకలు బంద్‌. ఉన్న మట్టి రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో అప్పాజీపేట, బోడాయిగూడెం గ్రామాల ప్రజలు సుమారుగా 250 మంది మండల కేంద్రానికి రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితంలేదు.


జనానికి తప్పని ఇబ్బందులు..

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేని పరిస్థితి నెలకొంది. సరైన వసతి లేకపోవడంతో అప్పాజీపేట గ్రామంలో ఉన్న పాఠశాల నాణ్యత లోపంతో సగం కూలిపోయింది. విద్యార్థులు చదువులకు కూడా దూరమవుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతాల్లో బురద రోడ్లు నరకానికి నకలుగా మారుతాయి. కనీసం నడవడానికి కూడా వీలుండదు. పలిమెల మండలం అప్పాజీపేట గ్రామానికి కనీసం రోడ్డు కూడా ఉండదు. ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కిలోమీటర్ దూరం అది ఎడ్ల బండి బాట మాత్రమే ఉంటుంది. వర్షాకాలంలో గ్రామ పంచాయితీకి వెళ్లాలంటే చెరువు, మత్తడి, దాటి చెరువు కట్టమీదగా వెళ్ళాలి. ఎడ్లబండ్ల బాట కావడంతో దగ్గరగా ఉండి తొలిగి పోవడనికిలేదు. తొలగాలంటే కట్టచివరనే ఉండి వెళ్లిన తర్వాత పోవాలి. వర్షం పడితే ఆ దారి బంద్. మళ్ళీ అడవి దారి పట్టాల్సి వస్తుంది. దీంతో ఇక్కడి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్పాజీపేట నుంచి పలిమెల వెళ్లలేని దుస్థితి. అటవీశాఖ అడ్డంకులు తెలిపినా గ్రామస్తులు చెరువు మీది నుంచి ఫారెస్ట్ భూమిలో నుండి తిరిగి రావలసిన పరిస్తితి. వర్షం కురిస్తే అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి.


రోడ్డు సౌకర్యంపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ఆ గ్రామాభివృద్ధికి, ఇతర ప్రాంతాలతో సత్సంబంధాలు ఏర్పడడానికి అవసరమైన రవాణా సౌకర్యం కరువవుతోంది. అందుకు మండలంలోని పంచాయతీల్లో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే నిదర్శనం. గ్రామ పంచాయతీల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు రోడ్డు సౌకర్యమే సరిగ్గా లేదు. బోడయిగూడెం నుండి అప్పాజీపేట గ్రామాలకు బీటీ రోడ్లు లేక ప్రజలకు కాలినడక తప్పడం లేదు. వర్షాకాలంలో చినుకుపడితే రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. అప్పాజీపేట నుండి పలిమెల మండలానికి వెళ్లాలంటే చెరువు, మత్తడి దాటాలి. ప్రజలు కాలంతో నిమిత్తం లేకుండా అవస్థలు పడుతున్నారు. ఏదేమైనా రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పాజీపేట రావాలంటే ఎడ్ల బండి బాటే దిక్కవుతున్నాయి. మండలానికి రావడానికి వీరు నిత్యం మండలంలోని నిత్యవసరలకు చెరువు కట్టమీదగా ఎడ్లబండి బాటతో నానా ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కారించాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story