టిప్పర్ బ్రేక్ ఫెయిల్.. యాదాద్రి కొండపై బోల్తా..

by Vinod kumar |
టిప్పర్ బ్రేక్ ఫెయిల్.. యాదాద్రి కొండపై బోల్తా..
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో యాదవ్ నగర్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాత ఘాట్ రోడ్డుకు అనుబంధంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి పై నుండి జేఎస్ఆర్ కాంట్రాక్టర్స్ కి చెందిన టిప్పర్ లారీ బ్రేక్ ఫైల్ అయ్యి క్రిందకి పడింది. అందులో ఉన్నలారీ డ్రైవర్ రహీం(45)కి తీవ్ర గాయాలవడంతో ఘటన స్థలం వద్ద ఉన్నటువంటి స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎటువంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ విషయం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed