- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
ఇంగ్లాండ్‌పై చెలరేగిన పంత్.. ధోనీ 17ఏళ్ల రికార్డ్ బ్రేక్..

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ రీషెడ్యూల్ టెస్ట్‌లో టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్, కీపర్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. కీలక వికెట్లు కోల్పోయి జట్టు ఆపదలో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్ ఆద్భుతమైన షాట్లతో అలరించాడు. ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన పంత్ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 111 బంతులు ఎదుర్కొన్న పంత్ 20ఫోర్లు, 4 సిక్సర్లతో విలువైన 146 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్, కీపర్ ధోనీ 17ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేశాడు. 2005లో పాకిస్థాన్‌పై ధోనీ 93 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీనితో ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్ తరపున వేగవంతమైన సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ కొనసాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై కేవలం 89 బంతుల్లోనే సెంచరీ బాదిన పంత్.. ధోని 17ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసి.. ఇండియా తరపున టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులోకెక్కాడు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.