వాటిపై నిషేధాజ్ఞల కొనసాగింపు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న పోలీస్ కమిషనర్

by Dishafeatures2 |
వాటిపై నిషేధాజ్ఞల కొనసాగింపు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న పోలీస్ కమిషనర్
X

దిశ, సిద్దిపేట: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు చేస్తున్నట్లు సీపీ శ్వేత పేర్కొన్నారు. సాధారణ పౌరులు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై ఈ నెల 31వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మద్యం ప్రియుల ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశంలో, అనుమతి లేని ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై 188 IPC, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే డీజేలపై నిషేధాజ్ఞలు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు.చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగిందన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై సెక్షన్ 188 IPC, 76 సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.



Next Story

Most Viewed