రిపోర్ట్: రాబోయే 12 నెలల్లో మాంద్యం ఎదుర్కోబోతున్న ప్ర‌ధాన దేశాలు ఇవే..

by Disha Web Desk 20 |
రిపోర్ట్: రాబోయే 12 నెలల్లో మాంద్యం ఎదుర్కోబోతున్న ప్ర‌ధాన దేశాలు ఇవే..
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంపై క‌రోనా దెబ్బ తీవ్రంగా క‌నిపిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి త‌ర్వాత ప‌లు దేశాల్లో ప‌రిస్థితులు మారాయి. అనారోగ్యం, అనిశ్చితుల మ‌ధ్య ప్ర‌జ‌ల‌ జీవన వ్యయం పెరగింది. దారి లేక‌ ప్రభుత్వం విధానాలను కఠినతరం చేసింది. ఇటువంటి కారణాలతో అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రాబోయే 12 నెలల్లో మాంద్యాన్ని ఎదుర్కొంటాయని, నోమురా హోల్డింగ్స్ ఇంక్ అనే బ్రోకరేజీ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఈయూ, యూకె, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా దేశాలు మాంద్యంలోకి ప్రవేశిస్తాయని, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్ర‌భావం మ‌రింత ఉండ‌నుంద‌ని నివేదిక వెల్ల‌డించింది. దీనితో సమకాలీకరించబడిన వృద్ధి మందగమనంలోకి వెళ్తుందని స‌ద‌రు సంస్థ అంచనా వేసింది. నోమురాలోని రాబ్ సుబ్బరామన్, సి యింగ్ తోహ్ ఒక పరిశోధనలో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక ప్ర‌కారం, రష్యా యూరప్‌కు పూర్తిగా గ్యాస్‌ను నిలిపివేస్తే ఐరోపాలో తిరోగమనం మరింత లోతుగా ఉంటుందని ఆర్థికవేత్తలు తెలిపారు. జపాన్ ఆర్థిక సేవల సంస్థ నోమురా 2023లో యుఎస్, 'యూరో ఏరియా' ఆర్థిక వ్యవస్థలు కొంత‌మేర కుదించుకుపోతాయ‌ని పేర్కొంది. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియాతో సహా మధ్యతరహా ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల పెంపుతో అంచనా కంటే లోతైన మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు.


Next Story

Most Viewed